Home ఆంధ్రప్రదేశ్ కోడి ఈకలు, చేప పొలుసు వాయు కాలుషం నివారణ కోడి ఈకలు, చేప...

కోడి ఈకలు, చేప పొలుసు వాయు కాలుషం నివారణ కోడి ఈకలు, చేప పొలుసు, నీరు, గ్లిసరిన్‌ కలిసి వేడి చేస్తే బయో ప్లాస్టిక్‌ తాయారు మోకాళ్ల నొప్పులకు ఫిష్‌ జెల్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది

82
0

అమరావతి అక్టోబర్ 2
కోడి ఈకలు వాయు కాలుషం నివారణలో ఉపయోగపడతాయని యశస్వి నిరూపించింది. కోడి ఈకలు, చేప పొలుసు వంటి వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చి వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టింది విజయవాడ విద్యార్థిని మట్ల యశస్వి. ఈ ఈకలను డిస్క్‌ మాదిరిగా చేసి ఫ్యాక్టరీ పొగ గొట్టాలు, వాహనాల సైలెన్సర్ల వద్ద ఉంచినప్పుడు కాలుష్యం తగ్గింది. అంతేకాకుండా కోడి ఈకలు, చేప పొలుసు, నీరు, గ్లిసరిన్‌ కలిసి వేడి చేస్తే బయో ప్లాస్టిక్‌ తయారవుతోంది. ఇది సులభంగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. చేప పొలుసును నీటితో కలిపి వేడి చేస్తే ఫిష్‌ జెల్‌ తయారవుతోంది. దీనిని ఐరన్‌ రాడ్లకు పూస్తే తుప్పు పట్టకుండా నివారిస్తోంది. మోకాళ్ల నొప్పులకు సంబంధించి కార్టిలేజ్‌ ట్రీట్‌మెంట్‌లో చేపల పొలుసులు ఉపయోగపడనున్నాయి. ఇందులో కొలాజిన్‌ అనే పదార్థం ఉండటం వల్ల ఈ జెల్‌ను ఉపయోగిస్తే  నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెయింట్‌ వేసేటప్పుడు ఈ జెల్‌ను కలిపి వాడితే గోడలకు చెమ్మ రాకుండా, పెచ్చులూడకుండా నివారించవచ్చు.ఈ వినూత్న ఆలోచనకు జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్‌ అవార్డు వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌ అంతర్జాతీయ పోటీలకు సైతం నామినేట్‌ అయింది. గత ఏడాది పదో తరగతి చదువుతున్నప్పుడు యశస్వి దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ చదువుతోంది. కోడి ఈకలలోని కొలాజిన్, చేపల పొలుసులోని కెరోటిన్‌లతో పర్యావరణ హితమై భూమిలో కలిసిపోయే బయో ప్లాస్టిక్, తేలికపాటి సిమెంట్‌ ఇటుకలు, బయో ఎరువులు, పెయింట్‌ల వినియోగంలో పెచ్చులూడి పోకుండా చేయడం, వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడం, కొలాజిన్‌ వినియోగంతో ఐరన్‌ తుప్పు పట్టే గుణం తగ్గడం, కార్టిలేజ్‌ ట్రీట్‌మెంట్‌ వంటి వాటిపై పరిశోధనలు చేసిన యశస్వి వాటిని శాస్త్రీయంగా నిరూపించింది. కోడి ఈకలు, చేప పొలుసును సిమెంట్, ఇసుక, నీటితో కలిపి తేలికగా ఉండే సిమెంట్‌ ఇటుకలను తయారు చేసింది. ఈ ఇటుకలను ల్యాబ్‌లో పరిశీలించగా బలంగానే ఉన్నాయని నిరూపణ అయ్యింది.

Previous articleప్రపంచానికే శాంతి సిద్ధాంతాన్ని పరిచయం చేసిన మహానేత గాంధీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
Next articleరన్ ఫర్ పీస్ లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here