న్యూఢిల్లీ నవంబర్ 5
దేశంలో వంట నూనెల ధరల గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ విభాగం తెలిపింది. నూనె రకాన్ని బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.7 నుంచి గరిష్ఠంగా రూ.20 వరకు తగ్గినట్లు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్టుమెంట్ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. పామాయిల్, పల్లి నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్రధానమైన నూనె రకాలపై ధరలు తగ్గినట్లు తెలిపారు. కాగా, కరోనా దేశంలో కాలుమోపిన అనంతరం కొండెక్కిన వంట నూనెల ధరలు.. ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి.2020, మార్చిలో కిలో రూ.70-80 మధ్య ఉన్న వంట నూనెల ధరలు ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా కొండెక్కాయి. కిలో నూనె రూ.190-200 వరకు పలికింది. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చి ప్రస్తుతం 150-160 మధ్య ఉన్నది. ఇప్పుడు ధరలు మరికాస్త తగ్గడంతో కిలో నూనె రూ.140కి అటుఇటుగా ఉండే అవకాశం ఉన్నది.