న్యూఢిల్లీ అక్టోబర్ 1
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారంతో 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు
‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింప్లిసిటీ, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆయురారోగ్యం, సంతోషాలతో చాలా ఏళ్లు దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలు అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.