Home తెలంగాణ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ని కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి బిజెపి...

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ని కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొడిపెల్లి

71
0

జగిత్యాల
సన్న, చిన్న కారు రైతులు  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కి  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బిజెపి జిల్లా  కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్ రెడ్డి కోరారు.  ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి ద్వారా డబ్బులు రాని రైతులు, కొత్త రైతులు కూడా ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డ్, పట్టాదార్ పాస్ బుక్,  బ్యాంకు ఖాతా వివరాలు  సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  చిన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమం చాలా ఉపయోగంగా ఉందని, ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రైతులు ఒప్పంద సాగుకు సరైన పద్ధతిలో ఒప్పందం చేసుకొని గతంలో రైతులను మోసం చేసినా చాలా కంపెనీలపై జిల్లా కలెక్టరేట్  చర్యలు తీసుకోవాలని, కంపెనీలు చేసుకున్న  ఒప్పందాలను వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలని,  వరి, అవా  వివిధ  విత్తన కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలని గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్ కుమార్,  యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేంటం జగదీష్, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, కిసాన్మోర్చా జగిత్యాల పట్టణ అధ్యక్షుడు ముద్దం రాము, యువ మోర్చా జిల్లా కార్యదర్శి కర్ణ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Previous articleఓటరు గుర్తింపు కార్డు లేనివారు.. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయవచ్చు * జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు
Next articleగంగాభవాని స్నానఘట్టాల పరిశీలించిన ఈ ఓ ఎస్ లవన్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here