జనగామ
జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్ వల్ల ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. టీఎస్ 04 యూడీ 1089 నెంబర్ గల బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయింది. సుమారు 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఛత్తీస్ ఘఢ్ జగదేవపూర్ టు హైదరాబాద్ కు వెళ్తుండగా సోమ వారం ఉదయం 4:30 గంటల సమయాన ఘటన జరిగింది. ఆ పమయంలో ప్రయాణికులు అందరూ నిద్రలో ఉన్నారు. జనగామ ఆర్టీసీ కాలనీ హైవే లో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగడంతో డ్రైవరు అలర్ట్ అయ్యాడు. వెంటనే ప్రయాణికులను కిందికి దింపి వేయడంతో డ్రైవర్ తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు