ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ సమీపంలో సాయి కృష్ణ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బస్సు విజయవాడ నుండి శ్రీకాకుళం వెళ్తుండగా మార్గమధ్యంలో ఘటన చోటుచేసుకుంది. 108 వాహనాల్లో క్షతగాత్రులకు సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.