నంద్యాల
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సైదాను రాష్ట్ర టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ ఆహమ్మద్,
నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు, జాతీయ అధికార ప్రతినిధి,గుంటూరు ఇన్-ఛార్జ్ నసీర్ ఆహమ్మద్ పరామర్శించారు . వైసిపి అధికారం చేపట్టిన దగ్గర నుండి ముస్లిం మైనార్టీ లపై,దళితుల పై దాడులు జరుగుతున్నాయని
టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు.వైసిపికి చెందిన వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదాను గురువారం రాష్ట్ర ముస్లిం నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు మాట్లాడుతూ వైసిపి నాయకులు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో దాడికి పాల్పడిన వారి వివరాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.చట్టపరంగా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుందని విమర్శించారు.ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన చట్టసభలో వ్యక్తిగత దూషణలతో వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు పైశాచిక ఆనందం పొందుతూ ప్రజా సమస్యలు గాలికొదిలేశారు అన్నారు. టిడిపి హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింల అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేస్తూ వైసిపి హయాంలో ముస్లిం మైనార్టీల పై జరుగుతున్న దాడుల పట్ల ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. ముస్లిం మైనార్టీల ఓటు లేకుండా జగన్ ముఖ్యమంత్రి అయ్యే వారా ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ సోదరులు అంతా ఏకమై వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.గుంటూరు తూర్పు టిడిపి ఇన్-ఛార్జ్,జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహమ్మద్ మాట్లాడుతూ సైదా కుటుంబానికి ముస్లిం మైనారిటీ లు టిడిపి అండగా నిలుస్తుందన్నారు.సైదా పై దాడి చేసిన నిందితులను గుర్తించినప్పటికీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారిని చర్యలు తీసుకోకపోవడం దారుణమని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే పోరాటం చేస్తామన్నారు.టిడిపి రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ లో దళితుల ఓట్లతో గద్దెనెక్కిన వైసిపి ప్రభుత్వం చివరకు వారినే టార్గెట్ చేసిందని ప్రభుత్వ వికృత చేష్టలను అసభ్య పదజాలాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.గాయపడిన సైదాకు తక్షణమే రూ.20 లక్షలు ఆర్థిక అందజేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర మైనారిటీ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ జరీనా సుల్తానా బేగం మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు అమీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నేతలు అరాచకాలు తాలిబన్ల నే భయపెట్టేలా తయారయ్యాయని,అల్లా అల్లా అని అరుస్తున్న కనికరం చూపకుండా రాళ్లతో దాడి చేశారని, మైనార్టీ వైసీపీ ఎమ్మెల్యే లకు,డిప్యూటీ సీఎం కు కనీసం మానవత్వం కూడా లేదని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధికార ప్రతినిధి మనుకొండ జాహ్నవి,పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్ కరిముల్లా,బాబావలి, కరిముల్లా,మన్నన్ షరీఫ్, లీగల్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు రావెళ్ల లక్ష్మీనారాయణ,నరసరావుపేట పట్టణ మైనార్టీ అధ్యక్షులు బడే బాబు,మబు,సైదవాలి,బాషా,యాడ్స్ వలి,మీరవాలి,మొహమ్మద్ రఫీ, ఉమ్మర్,సైదవాలి,ఖాలీల్ తదితరులు పాల్గొన్నారు