అనకాపల్లి
మండలంలోని మాకవరం గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్ మొయ్య భవానిని అవమానపరిచిన స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్‌నాథ్ తక్షణమే ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ స్థానిక రామచంద్ర థియేటర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బోని గణేష్ మాట్లాడారు.