నంద్యాల
నంద్యాల పట్టణంలో భూమ బ్రహ్మానందరెడ్డి ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మాజి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తో మంగళవారం నాడు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో భూమ బ్రహ్మానందం రెడ్డి మాట్లాడుతూ. కరెంటు చార్జీలు ఇప్పటికే 6 సార్లు పెంచారని సామాన్య పేద మద్య తరగతి ప్రజల పెంచిన విద్యుత్ చార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు . సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా రానున్న రోజుల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారని తెలుస్తోంది. పరి పాలనా చేత కాక పోతే ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాద యాత్రలో కరెంటు చార్జీలు పెంచనని చెప్పారని కాని వచ్చిన రెండున్నర సంవత్సరాల లో ఆరు సార్లు పెంచడం సిగ్గుచేటన్నారు. ఈ విషయం ఫై నంద్యాల పార్లమెంట్ పరిధిలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రభుత్వ అవినీతి గురించి తెలియజేయాలని పిలుపునిచ్చారు . ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు. నాయకులు పాల్గొన్నారు.