విజయవాడ
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 126 వ జయంతి వేడుకలను బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. జాషువా గొప్ప జాతీయ వాదని బిజెపి నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు మాట్లాడుతూ గుర్రం జాషువా తెలుగుసాహితీ లోకంలో అరుదైన స్ధానాన్ని సాధించారన్నారు. సమాజం మెచ్చిన సహజకవిగా సోము వీర్రాజు కీర్తించారు. చిన్నిచిన్న పదాలతో పెద్ద విషయాన్ని చెప్పగల కవి గుర్రంజాషువా అన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ జాషువాలో గొప్ప జాతీయ వాది ఉన్నారని సోదాహరణంగా వివరించారు. జాషువా కలం నుండి ఎన్నో ఖండకావ్యాలు రచించ బడ్డాయన్నారు. జాతీయ కార్యదర్శి సునీల్ థియెధర్ మాట్లాడుతూ జాషువా మార్గదర్శకుడని వివరించారు. నేటి ప్రజల నాల్కల మీద జాషువా ఇంకా నానుతున్నాడంటే జాషువా ఈ సమాజానికి చేసిన సేవ వెలకట్టలేం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం,ఓబిసి మోర్చా నాయకులు బిట్ర శివన్నారాయణ, బిజెపి మీడియా కో ఆర్డినేటర్ లక్ష్మిపతి రాజా, కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.