పెద్దపల్లి నవంబర్ 05
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ పీకే రామయ్య కాలనిలో గత కొన్ని నెలలగా మంచి నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2019లో సామాజిక కార్యకర్త మడిపెల్లి మల్లేష్ తన సొంత ఖర్చులతో బోర్లు వేసి కాలని ప్రజల నీటి సమస్య తీర్చారు. బోర్లకు కరెంట్ సప్లై ఉచితంగా ప్రజల అవసరాల నిమిత్తం రామగుండం కార్పొరేషన్ విద్యుత్ సిబ్బందికి లెటర్ ఇవ్వవలసి ఉంటుంది. కార్పొరేషన్ సంబంధించిన లెటర్ ఇవ్వనందన కరెంట్ అధికారులు మోటార్స్ కు ఉన్న విద్యుత్ సరఫరాను తీసివేశారు. దినికి సంబందించిన లెటర్ గురించి రామగుండం కమిషనర్ కి సామాజిక కార్యకర్త మడిపెల్లి మల్లేష్ సెప్టెంబర్ 30న మునిసిపల్ కమిషనర్ కి ఇవ్వడం జరిగింది. కమిషనర్ మునిసిపల్ ఢీఈకి ఫార్వాడ్ చెయ్యడం జరిగింది. ఢీఈ మాకు మీటర్ సంక్షేన్ లెటర్ ఇస్తే మా కాలని ప్రజలకు ఈ నీళ్ల బాధలు ఉండేవి కాదని మడిపెల్లి మల్లేష్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి పీకే రామయ్య కాలని ప్రజల నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.