కరీంనగర్
ప్రజలకు బాధ్యతాయుతంగా మెరుగైన వైద్య సేవలు అందించినపుడే ప్రయివేటు ఆసుపత్రులపై ప్రజలకు అపారమైన నమ్మకం కలుగుతుందని..టిఆర్ఎస్ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు..మజ్లిస్ ఉల్ ఉలేమా అధ్యక్షుడు..హిప్జుల్ ఖురాన్ మదర్సా ప్రిన్సిపాల్ ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. సోమవారం నగరంలోని మంచిర్యాల చౌరస్తా మజీద్ పక్కన కరోనా స్పెషల్ డాక్టర్ అబ్దుల్ వసీం కు చెందిన క్యూర్ వెల్ హాస్పిటల్ ను ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రారంభించారు. ఈసందర్భంగా ముఫ్తి ఘియాస్ మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ వసీం కరోనా ఆపత్కాలయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అలుపెరుగకుండా చేసిన కృషిని జిల్లా..నగర ప్రజలు ఎప్పటికి మర్చిపొరన్నారు. కరోనా మొదటి.. రెండో దశలు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కరోనా బారిన పడి ఇంటిలో చికిత్స పొందుతున్న సామాన్య జనాలు రాత్రి.. పగలు తేడా లేకుండా పవిత్ర రంజాన్ మాసంలో ఒక్కపొద్దు రోజాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఫోన్ లో వైద్య సహాయం అందించి..కొంచెం కూడా ఎవరిని నొప్పియ్యకుండా అభిమానంతో వైద్య సహాయం అందించిన మహోన్నత వ్యక్తిత్వం గల డాక్టర్ అబ్దుల్ వసీం అన్నారు. చాలా తక్కువ ఫీజుతో..పేద వాళ్లకు అండగా..మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం కోవిడ్ వైద్య సేవలు అందించారన్నారు. అబ్దుల్ వసీం లక్షలాది మందికి కరోనా ఆపత్కాలంలో అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొని ప్రాణదాతగా నిలిచారన్నారు. ఆయన సేవలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యో నారాయనో హరీ అని పెద్దలు అన్నట్టు వైద్యులు ప్రాణాధాతలని.. వారిని గౌరవించాలన్నారు. ఈకార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖైరుద్దీన్, ముఫ్తి యునూస్ ఖాస్మి, ప్రభుత్వ ఆసుపత్రి ఏవో నజీముల్లాహ్ ఖాన్, ముస్లిం జెఎసి జిల్లా అధ్యక్షుడు షేక్ అబూబకార్ ఖాలీద్, నిసారూల్ హాక్, కలీమ్ షరీఫ్, ఖాధిమానే మిల్లత్ కారదర్శి సమద్ నవాబ్.. ఖాజీ ముఖయ్యర్ షా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.