జగిత్యాల నవంబర్ 01
ప్రజా సమస్యల పరిష్కరానికే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ గోగుల రవి తెలిపారు .ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యల పరిష్కారానికి కలెక్టర్, జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు. ప్రజావాణి ఈ కార్యక్రమానికి 25 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కరోనా తీవ్రత అదృష్టం రద్దు చేసిన ప్రస్తుతం మళ్లీ ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లోకల్ బాడీ అరుణ శ్రీ ,జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.