Home నగరం పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా నమ్మకం లేని చోట నేను ఉండను

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా నమ్మకం లేని చోట నేను ఉండను

126
0

రాజకీయ భవిష్యత్‌ గురించి నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి
చండీగఢ్‌ సెప్టెంబర్ 18
పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేశారు. కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి శనివారంతో తెరపడింది. రాజ్‌భవన్‌కు చేరుకుని అమరీందర్‌ సింగ్‌ గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎల్పీ భేటికి ముందే రాజీనామా చేయడం గమనార్హం. సీఎంతో పాటు మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. 2017 మార్చి 16న సీఎంగా అమరీందర్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో విబేధాలు కొనసాగుతున్నాయి.రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉదయం సోనియాగాంధీతో మాట్లాడా. నమ్మకం లేని చోట నేను ఉండను. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టారు. ఇది నాకు అవమానకరంగా అనిపించింది. ప్రభుత్వాన్ని నడపలేనని అనుకున్నట్లున్నారు. ఎవరి మీద నమ్మకముంటే వారిని సీఎం చేసుకోమని చెప్పా’ అని తెలిపారు.
అయితే తన భవిష్యత్‌ కార్యాచరణపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. ‘రాజకీయ భవిష్యత్‌ గురించి నాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయాలు వినియోగిస్తా. నా వెంట ఉన్నవారితో మాట్లాడి భవిష్యత్‌పై నిర్ణయం’ అని అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. ఈ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో వివాదం మరింత ముదిరింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాలు తారస్థాయికి చేరాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అమరీందర్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Previous articleరాష్ట్రం లో పంట నష్టం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం
Next articleశ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై జనసేనాని – త్రివిక్రమ్ ముచ్చట పవన్ కల్యాణ్ గారు… శ్రీ త్రివిక్రమ్ గారు కలసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here