చంఢీఘడ్ అక్టోబర్ 1
కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తానూ పెట్టబోయే పార్టీకి పంజాబ్ వికాస్ పార్టీ అని పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వైఖరి నచ్చకపోవడంతో.. ఇటీవల సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు, ఆయన రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వ్యాపించాయి. ఆ వార్తలను అమరీందర్ కొట్టిపారేశారు. బీజేపీలో చేరడం లేదని, అలాగే కాంగ్రెస్‌లో కొనసాగడం లేదన్నారు. దీంతో ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ అమరీందర్ పెట్టబోయే పార్టీకి పంజాబ్ వికాస్ పార్టీ పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.