పెద్దపల్లి అక్టోబర్ 08
స్వచ్చత పఖ్ వాడా -2021 (రండి చేయి చేయి కలుపుదాం.. స్వచ్చ ఉద్యమం చేపడదాం) కార్యక్రమం ఈ రోజు ఆర్జి 1 ఏరియా హాస్పిటల్ లో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ లోని డాక్టర్ లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ఆఫీస్ క్లరికల్ స్టాఫ్ ఎంతో ఉత్సాహంగా హాస్పిటల్ పరిసరాలలోని చెత్త , ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా డివైసిఎంఓ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం భాగుంటుందని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రతి ఒక్కరి లో పరిశుభ్రత భావం పెరిగిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని ,అదే విధంగా సానిటైజర్ లను, మాస్కులను వాడుతూ వ్యక్తిగత శుభ్రతను కూడా పాటిస్తున్నారని అన్నారు. స్వచ్చత పఖ్ వాడా -2021 చాలా చక్కటి కార్యక్రమం అని మన ఇల్లు ఏ విధంగా శుభ్రంగా ఉంచుతామో అదే విధంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రం గా ఉంచిన నాడే అసలైన దేశ పౌరులం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ లను, నర్సులను, పారా మెడికల్ సిబ్బందిని, ఆఫీస్ క్లరికల్ స్టాఫ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డివై సిఎంఓ డా.కిరణ్ రాజ్ కుమార్, డాక్టర్ మద్దెలేటి, డా. రమేశ్, డా. అంభికా, డా.రవీంధర్, ఫిట్ సెక్రటరీ రత్నమాళ, యూనియన్ నాయకులు యాదవ రెడ్డి, సంక్షేమాధికారి కందగడ్ల శ్రీనివాస్, మా(టిన్ రూథ్ మణి, శేషగిరి, విజయ అంజలీనా పాల్గొన్నారు.