మైదుకూరు
తెదేపా పార్టీ పిలుపు మేరకు మంగళవారం మైదుకూరు లో భారత్ పెట్రోల్ బంక్ వద్ద నిరసన ప్రదర్శనకు వెళ్తున్న మైదుకూరు తెదేపా ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రొద్దుటూరు నివాసం లోపోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి కార్యకర్తలతో వెళుతున్న నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని పోలీస్ లతో వాగ్వివాదం చేశారు. తన ఇంటిలోనే పెట్రోల్ పై ప్రభుత్వ విధానం పై నిరసనవ్యక్తం చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ హౌస్ అరెస్ట్ ను మైదుకూరు నియోజకవర్గం తెదేపా నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఖండిచారు.