హైదరాబాద్ డిసెంబర్ 3
;: నాణ్యమైన వైద్యసేవలు పేద ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్‌పేట్‌లోని రాజీవ్ గాంధీ నగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఓపీడీ కన్సల్టేషన్, టెలీ కన్సల్టేషన్, బేసిక్ ల్యాబ్ డయాగ్నోసిస్, సాధారణ అనారోగ్య చికిత్సలకు వైద్యం అందించనున్నారు. శుక్రవారం నగర వ్యాప్తంగా 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.