జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి
జగిత్యాల అక్టోబర్ 04
ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తు లను వెంటనే పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి ఆదేశించారు.. ఈ సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రజావాణికి కక్షిదారులు తాకిడి ఎక్కువైంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ని కోవిడ్ 19 కారణంగా కొంత కాలం పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. ఆసమయంలో జిల్లా కలెక్టరేట్ లోని ఇన్ వార్డు సెక్షన్ లో దరఖాస్తులు ఇచ్చేందుకు అవకాశాలు కల్పించారు. అయితే చాలా కాలం పాటు రద్దయిన ప్రజావాణి ని ఇటీవలే పున: ప్రారంభించగా చాలామంది తమకు సంబంధించిన ఫిర్యాదులు అందజేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రజావాణి సద్వినియోగం చేసుకుంటున్నారు. వారం వారం ప్రజావాణికి పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రజావాణి కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది సంఖ్యను పెంచి భద్రత చర్యలు చేపడుతున్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యల పరిష్కారానికి కలెక్టర్, జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. ప్రజా ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలు పరిష్కారించాలని 28 వినతులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తోపాటు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ , జిల్లాలోని వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.