మద్దికేర
మండల కేంద్రమైన మద్ధికేర లో రబీ 2021 పప్పు శనగ విత్తన పంపిణీ కార్యక్రమం ను వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు.శుక్రవారం రోజున ఎంఏవో హేమలత మరియు ప్రజా ప్రతినిధులు ఈ పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంఏవో హేమలత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక క్వింటం పూర్తి ధర 6900 కాగా,సబ్సిడీ ధర 1725 రూ అని, రైతు కట్టవలసిన ధర 5175 రూ అని 25% సబ్సిడీతో విత్తనాలు పంపిణీచేయడం జరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, ఎంఏఏబి చైర్మన్ రాజశేఖర్ రావు,గ్రామ సర్పంచ్ సుహాసిని,మాజీ ఎంపిపి మల్లికార్జున,ఏఈవో యోగేంద్ర,విఏఏ లు ఆనంద్,జాకీర్,రాణి, కవిత మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం ను అధికారులు ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎంఏవో హేమలత మాట్లాడుతూ కంది పంటలో నల్లి పురుగు ద్వార వెర్రి తెగులు వస్తుందని తెలిపారు.ఈ తెగులు వచ్చిన ఆకులు పసుపు రంగులోకి మారి, అక్కడక్కడ పచ్చగా ఉబ్బెత్తుగా ఆకు ఏర్పడుతుందని తెలిపారు.ఈ (నల్లి) వెర్రి తెగులు నివారణకు డైకోఫాల్ 5 మి.లీ, పొడిగంధకం 3గ్రా, కెరాథియన్ 4మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు. అలాగే ఈ క్రాప్ బుకింగ్ (పంట నమోదు) తప్పనిసరిగా చేయించు కోవాలని తెలిపారు.
అలాగే 2021 ఖరీఫ్ సీజను లో వేసిన వేరుశనగ,పత్తి,కంది, సజ్జ వంటి వివిధ పంటలపై పంటల పరిస్థితిలను తెలుసుకుని మండల సభ్యులతో చర్చిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఈఓ యోగేంద్ర,మండల సభ్యులు గురుస్వామి,హనుమంతు,విఏఏ లు ఆనంద్,రాణి,జాకీర్,కవిత మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.