బెంగళూరు అక్టోబర్ 19
కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డ్రగ్స్ వ్యాపారి, వాటికి బానిస ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎవరు? ఆయనో డ్రగ్స్ బానిస, వాటి వ్యాపారి. నేను చెప్పడం లేదు. మీడియాలోనూ వచ్చింది. మీరు పార్టీని నడిపించలేరు అంటు నళిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఓ నిరక్ష్యరాస్యుడు అని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన ట్వీట్‌పై నళిన్‌కుమార్ ఇలా ఘాటుగా స్పందించారు.అయితే ఆ వివాదస్పద ట్వీట్‌ను తమ సోషల్ మీడియా డిలీట్ చేసిందని ఆ తర్వాత శివకుమార్ చెప్పారు. అయితే దీనిపై నళిన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను శివకుమార్ ఖండించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను కూడా గౌరవించాలని నిన్న నేను చెప్పాను. బీజేపీ కూడా దీనికి అంగీకరిస్తుందని, వాళ్ల రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతుందని భావిస్తున్నాను అని శివకుమార్ మరో ట్వీట్ చేశారు.