Home జాతీయ వార్తలు ఏఐసిసి అధ్యక్షులుగా తిరిగి రాహుల్ గాంధీ ఎంపిక పార్టీ చీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు...

ఏఐసిసి అధ్యక్షులుగా తిరిగి రాహుల్ గాంధీ ఎంపిక పార్టీ చీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన రాహుల్

92
0

న్యూఢిల్లీ అక్టోబర్ 16
సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన‌ కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశంలో స‌భ్యులంద‌రూ రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాల‌నే ప్ర‌తిపాద‌న‌కు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు. నేత‌లంతా రాహుల్ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ప‌లికార‌ని సీడ‌బ్ల్యూసీ స‌మావేశం అనంత‌రం పార్టీ నేత అంబికా సోని విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవ్వాలని కాంగ్రెస్ నాయకులందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని అంబికా సోనీ తెలిపారు. 2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు.ఎన్నిక‌ల వ‌రకూ రాహుల్‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మించాల‌ని మ‌రి కొంద‌రు నేత‌లు సూచించారు.ఇక పార్టీ నేత‌ల ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలిస్తాన‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. పార్టీ ప‌గ్గాల‌ను చేప‌ట్టాలా లేదా అని తేల్చుకోవాల్సింది రాహుల్ గాంధీయేన‌ని అంబికా సోని పేర్కొన్నారు. దేశ రాజ‌కీయ ప‌రిస్ధితులు, ధ‌ర‌ల మంట‌, వ్య‌వ‌సాయ సంక్షోభం, రైతుల‌పై దాడుల వంటి అంశాల‌పై మూడు తీర్మానాల‌ను ఆమోదించామ‌ని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సీడబ్ల్యూసీ భేటీ అనంత‌రం వెల్ల‌డించారు.మ‌రోవైపు 2022లో కీల‌క రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని విమ‌ర్శ‌కుల నోళ్ల మూయించేందుకు తాను పూర్తికాల అధ్యక్షురాలినేన‌ని సోనియా గాంధీ స్ప‌ష్టం చేశారు. కాగా 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ పరాజ‌యం అనంత‌రం ఏఐసీసీ అధ్యక్ష బాధ్య‌త‌ల నుంచి రాహుల్ త‌ప్పుకోవ‌డంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్య‌క్షురాలిగా సీడ‌బ్ల్యూసీ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

Previous articleనగరంలో ఆదివారం ఓల్డ్ సిటీ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Next articleవిద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here