జగిత్యాల,అక్టొబర్ 30
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జగిత్యాల సీనియర్ పాత్రికేయులు, ఈనాడు అగ్రికల్చరల్ విలేకరి పురుషోత్తం రెడ్డి శనివారం రైతు నేస్తం అవార్డు అందుకున్నారు.
జగిత్యాలకు చెందిన పురుషోత్తం రెడ్డి రైతు నేస్తం 2021 పురస్కారానికి ఎంపిక కాగా విజయవాడలో జరిగిన పురస్కార సభలో ఉపరాష్ట్రపతి అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు.
అవార్డు అందుకోవడం పట్ల జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్,టివీ సుర్యం,కళాశ్రీ గుండేటి రాజు, కోండ్ర సుబ్బారెడ్డి, సిరిసిల్ల వేణుగోపాల్ తదితరులు పురుషోత్తం రెడ్డిని అభినందించారు.