రాజమహేంద్రవరం
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు ఎంపీ మార్గాని భరత్ రామ్ కౌంటర్ ఇచ్చారు. క్రమశిక్షణ, అంకితభావంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీలో పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్ నా పైన నమ్మకంతో ఎంపీ గా అవకాశం ఇచ్చారు. నా తమ్ముడు భరత్ అని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు నాకు చాలు. కొంతమంది కుహనా నాయకులు నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్తున్నారంటూ ఎంపీ భరత్ జక్కంపూడి రాజాపై మండిపడ్డారు. టిడిపి నేతలు బుచ్చయ్య, పెందుర్తి వెంకటేష్ తో నేను కుమ్మక్కయ్యానని సాక్ష్యాలు ఉంటే బయట పెట్టు అని అన్నారు. నీలా నేను చీకటి రాజకీయాలు చెయ్యను, నువ్వు చేసే ప్రతి దీ స్కూల్ కి వెళ్లే పిల్లవాడిని అడిగితే చెప్తాడు. జేడి లక్ష్మీనారాయణ తో ఒక ప్రోగ్రాం లో మాత్రమే కలిశాను, నేను సెల్ఫీ దిగితే ఫూటేజ్ చెక్ చేసుకోండి. ఆ సందర్భంలో సిఎం జగన్ పరిపాలనను జేడి ప్రశంసించారు. ట్రిపుర్ ఆర్ లా నాకు నీచ రాజకీయాల రావు చెయ్యను.. నన్ను రఘురామకృష్ణంరాజు తో పోల్చడం సిగ్గు చేటని అన్నారు.
గతంలో ఎంపీలు కనపడట్లేదని వార్తలు వేశారు. నేను సోషల్ మీడియాలో కనిపోస్తున్నాని నామీద పడుతున్నారు. రాష్ట్రపతి ప్రధానులకు ఫోన్ చేసి ఆయన ఏ బాషలో మాట్లాడతారో ఇక్కడి ప్రజలకు తెలుసు. ఆయన చిటికేస్తే రాజమండ్రిలో వచ్చేది బ్లెడ్ బ్యాచ్, చైన్ స్నాచర్లు, గంజాయి బ్యాచ్. నాకు పార్టీ ఇచ్చిన లక్ష్మణ గీత దాటను.. నువ్వు నీ పరిధిలో ఉంటే మంచిది. లెదంటే రెండు రాష్ట్రాల్లో నా సత్తా ఏంటో చూపిస్తా. నీలాగే నేను కూడా కిడ్ లా ప్రవర్తిస్తే నీకు నాకు తేడా ఉండదు. నా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంతెంత నిధులు తెచ్చి అభివృద్ధి చేసానో లెక్కలు చూసుకో మని సూచించారు