Home తెలంగాణ సంచార వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ఆకస్మిక తనిఖీ. మెగా...

సంచార వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ఆకస్మిక తనిఖీ. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

104
0

నంద్యాల

ఆళ్లగడ్డ అక్టోబర్ 1:-సంచార వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాని  ఆకస్మిక తనిఖీ గావించామని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్  అన్నారు.
శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని బత్తులూరు. నల్లగట్ల. ఆళ్లగడ్డ మండల కేంద్రంలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ .ఆళ్లగడ్డ  తహసిల్దార్ రమేష్ రెడ్డి లతో కలిసి ఆకస్మిక తనిఖీ గావించారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. మాట్లాడుతూ శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని బత్తులూరు. నల్లగట్ల. ఆళ్లగడ్డ మండల కేంద్రంలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ గావించమన్నారు.  నంద్యాల డివిజన్లో నిర్వహించుకుంటున్నా
మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఎం డి యు వాహన సిబ్బందిని  రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని అలా కాకుండా ఒకే ప్రదేశంలో వాహనాన్ని పెట్టి పంపిణీ గావించరాదని తెలిపారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ  వ్యాక్సిన్ వేయించుకోని వారికి  వ్యాక్సిన్ వేయించేలా చూడాలని మొదటి డోసు వేసుకొని రెండో డోసు వేయించుకోని వారు ఉన్నయడల  వారికి రెండో డోసు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు

Previous articleహైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి 16 పేర్లను సూచించింన కొలీజియం
Next articleనిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న వైయస్సార్ బీమా మృతుని కుటుంబానికి 10వేల నగదు చెల్లించిన వాలంటీర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here