Home ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్లకు విలువలేకుండా పోయింది

రేషన్ డీలర్లకు విలువలేకుండా పోయింది

105
0

కామారెడ్డి
సోయిలేని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేషన్ డీలర్లపై పట్టింపులేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు కమిషన్ పెంచడం లేదని రేషన్ డీలర్లు తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామ స్టేజి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారిని కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీలర్లు అందజేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కమిషన్ పెంపు రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్ అన్నారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న 70 రూపాయల కమిషన్ ఎందుకు సరిపోదని చెప్పారు. తన ఫార్మ్ హౌస్ లో ఉన్న కుక్కకు ఇచ్చిన విలువ రేషన్ డీలర్ కు ఇవ్వడం లేదని తెలిపారు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు. ఇన్నేళ్లు భరించారు.. మరొక రెండేళ్లు భరించండి.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మా ప్రభుత్వం రాగానే రేషన్ డీలర్లకు కమిషన్ పెంచుతామన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ కు దసరా వరకు పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దసరా తర్వాత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గౌరిశెట్టి రాజు, ఉపాధ్యక్షుడు నర్సింలు, జనరల్ సెక్రెటరీ శంకర్ రావు, తాడ్వాయి మండల అధ్యక్షుడు సంతోష్ రావు, డీలర్లు మల్లారెడ్డి, రాజు, రమేష్, ఖయ్యూమ్ నిశాత్, వివిధ మండలాల డీలర్లు పాల్గొన్నారు

Previous articleశాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప‌విత్రోత్స‌వాలు
Next articleరాయదుర్గంలో భారీ చోరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here