Home తెలంగాణ సర్జికల్ స్ట్రైక్ తో శత్రు దేశాలకు వణుకు పుట్టించిన రావత్ త్రివిధ దళాల్లో...

సర్జికల్ స్ట్రైక్ తో శత్రు దేశాలకు వణుకు పుట్టించిన రావత్ త్రివిధ దళాల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపిన రక్షణ సేనాని బిపిన్ రావత్ సంతాప సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

189
0

జగిత్యాల,డిసెంబర్ 9
మన పొరుగు దేశమైన పాకిస్థాన్ పై  భారత  సైనికులు  జరిపిన సర్జికల్ స్ట్రైక్  శత్రు దేశాలకు వణుకు పుట్టించిన ఘనత భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ సింగ్ రావత్ అని కరీoనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి చెప్పారు.బిపిన్ సింగ్  రావత్ సంతాప సభను జగిత్యాల లోని  ఇందిరా భవన్ లో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించగా కాంగ్రెస్ నాయకులతో కలిసి  రావత్ చిత్రపటానికి  పులమాల వేసి జీవన్ రెడ్డి ఘనంగా నివాలులర్పించారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వ పరంగా దేశానికి ఉపయోగపడే నిర్ణయాలుతీ సుకుంటామొ అలాగే  సైనిక  పరంగా ఆయుధాల సమకూర్పు, సైనికుల్లొ ఆథ్మస్థైర్యం నింపేటువంటి రావత్ తీసుకున్న పటిష్ట చర్యలు అమోఘమని  అన్నారు.దేశ రక్షణ రంగంలో రావత్ కుటుంబం ఎనలేని సెవలంధించారని, రక్షణ శాఖలో చిన్న ఉద్యోగిగా చేరి అంచెలంచులుగ  దేశ త్రివిధ దళాలకు అధిపతిగా ఎదిగి దేశ సేవలో ప్రాణాలర్పించడం గర్వించదగ్గ విశయమన్నారు.
రక్షణ సలహాలో విశిష్ట సేవలందించిన రావత్ మృతి దేశానికి తీరనిలోటని ,ఆయనతో పాటు మృతి చెందిన 13 మందికి సంతాపం తెలిపి  రెండు నిమిషాలు మౌనం పాటించారు. రావత్ మృతికి సంథపకంగా గురువారం
దేశ వ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలన్ని సోనియాగాంధీ సూచనల మేరకు రధ్ధుచెసుకున్నమని జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్,టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్,
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మొహాన్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మెన్ మన్సుర్ అలీ,మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య,కౌన్సిలర్ నక్క జీవన్, నాయకులు తాటిపర్తి  రాంచంద్రారెడ్డి  గుండా మధు, గాజుల రాజేందర్,బింగి రవి,పులి రామ్,అల్లాల రమేశ్ రావు,తాడేపు రమణ,నేహాల్ ,కమల్ , అజర్,మున్నా,విజయ్,రజినీకాంత్   తదితరులున్నారు.

తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించిన సొనియా

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య

తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి ఆమే పుట్టిన రోజున రాష్ట్ర ఏర్పాటు  ప్రకటన చేసిన సోనియాగాంధీ తెలంగాణ దేవత అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొనియాడారు.
గురువారం జగిత్యాలలో జీవన్ రెడ్డి  మాట్లాడుతూ యువత,నిరుద్యోగుల బలిధానాలకు ముగింపు పలుకాలనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన గొప్ప మానవతావాది సొనియా అని కొనియాడారు. దేశ
ప్రతిష్టాతను ఇనుమడింపజేయడంలొను,దేశ ఔన్నత్యాన్ని కాపడడంలొను ఇందిరా,రాజీవ్ గాంధీల తో పాటు సోనీయాగాంధి అంకిత భావంతో పనిచేశారన్నారు.

Previous articleసాగు చ‌ట్టాల‌ వ్య‌తిరేక ఆందోళ‌న‌ల‌న తాత్కాలికంగా విరమణ హామీల‌ను నెర‌వేర్చ‌ని ప‌క్షంలో మ‌రోసారి ఉద్య‌మం: సంఘాల నేత‌లు
Next articleఓ.టి ఎస్ పేరుతో గృహ లబ్ధిదారుల నుండి బలవంతపు వసూళ్లు ను ఆపండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here