పత్తికొండ
పత్తికొండ ఏపిఎస్ఆర్ఆసి డిపోను రాయలసీమ జోన్ అధికారి రవివర్మ అకస్మికంగా తనిఖీ చేశారు . శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని కాయలమాడ రోడ్కు ఉన్న పుచ్చ IF ఏపిఎస్ఆర్జేసి డిపోను పరిశీలించి సంబంధిత బస్సులను , వస్తువులను తనిఖీ చేశారు . డిపోలో కాలం చెల్లిన బస్సులు లేవని , ఒక్కొక్క బస్సు 15 సంవత్సరాల వరకు ఉంటాయని తెలిపారు . అనంతరం డిపో సిబ్బందితో ఆయన మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు . బస్సులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే స్థానిక అధికారులకు తెలియజేయాలన్నారు . రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందువలన కొత్త బస్సులు తీసుకురావడానికి సమయం పడుతుందని తెలిపారు . ఈ కార్య క్రమంలో కర్నూలు రీజనల్ మేనేజర్ టివి . రాము , డిపో మేనేజర్ కె . సుధారాణి , సిటిఎంటివిఎస్ సుధాకర్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .