తుగ్గలి
మండల కేంద్రమైన తుగ్గలి లోని గల స్థానిక తహసిల్దార్ కార్యాలయం ను ఆదోని ఆర్డిఓ రామకృష్ణా రెడ్డి గురువారం రోజున తనిఖీ చేశారు.అనంతరం తహసిల్దార్ నజ్మా భాను మరియు డిప్యూటీ తహసిల్దార్ నిజాముద్దీన్ ద్వారా భూ సర్వే గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.భూ సర్వే పనులు ఎటువంటి జాప్యం లేకుండా నిర్వహించాలని ఆర్డిఓ అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, మండల సర్వేయర్ గాధి లింగప్ప,తుగ్గలి మండల విఆర్వోలు,గ్రామ సచివాలయ సర్వేయర్లు,తహసిల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.