Home ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆర్డీవో పిర్యాదుతో కేసులు నమోదు తహశీల్దార్ గీతవాణి, ఆర్ ఐ...

కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆర్డీవో పిర్యాదుతో కేసులు నమోదు తహశీల్దార్ గీతవాణి, ఆర్ ఐ సిరాజ్ మరియు 11 మంది పై కేసులు

246
0

భూ మాయగాళ్ల పై జిల్లా కలెక్టర్ ఉక్కుపాదం
నెల్లూరు
నెల్లూరు జిల్లా. చిల్లకూరు మండలంలోని అధికారపార్టీ నేతల ప్రోత్సాహంతో పూర్వపు తహశీల్దారు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో చిల్లకూరు భూఆక్రమణలుపై జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు సమగ్రమైన విచారణ జరిపి తహశీల్దార్ గీతవాణి,ఆర్ ఐ సిరాజ్, కంప్యూటర్ ఆపరేటర్ నవిన్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
217 ఎకరాల మాయాజాలం..!
భూమి విలువ పెరుగుతున్నకొద్దికొందరునేతలుఅక్రమాలకుపాల్పడుతున్నారు. చిల్లకూరు మండలానికి చెందిన కొందరు వైసిపి నేతల ప్రోత్సాహంతో చిల్లకూరు పూర్వపు తహశీల్దర్ గీత వాణి భూ రికార్డులను మాయంచేసి ఏకంగా బినామీ ల పేరు మిందా రిజిస్ట్రేషన్ కొరకు గూడూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంకు ఆదేశాలు పంపారు.

చిల్లకూరు మండల పరిధిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. తమ్మినపట్నం గ్రామంలో జిందాల్‌ స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో గతంలో భూములు తీసుకొని ప్రాజెక్టు ఏర్పాటు చేయని వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తుంది. భూరికార్డులు తారుమారు చేశారు. డెరెక్టర్‌ ఆఫ్‌ పోర్టు పేరుతో ఉన్న భూములను 11 మంది వ్యక్తులు కొనుగోలు చేసినట్లు, భూమి హక్కుపత్రాలను పూర్వపు తహశీల్దారు గీతావాణి సంతకంతోఅనుమతిచ్చింది. సర్వే నెంబర్‌ 327- 3ఎ2 – హెచ్‌ 1 నుండి హెచ్‌11వరకు11మందిపట్టాదారులుగా, సాగుదారులు రికార్డు సృష్టించారు. డైరెక్టర్‌ ఆప్‌ పోర్టు పేరుతో సర్వేనెంబర్‌ 94-3లో మొత్తం 271 ఎకరాలుంది. దీనిని పరిశ్రమలకోసంతీసుకున్నారు. ఇప్పుడు ఇదే భూమిలో 209 ఎకరాలు కొనుగోలు దారులుగా రికార్డు చేశారు. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం 2010లో కెనేటా ఫవర్‌ ప్రాజెక్టుకు ఇచ్చింది. ఇప్పుడు దీనిని జిందాల్‌కు ఇవ్వనున్నారు.నష్టపరిహారం కింద రైతులకు అసైన్‌మెంట్‌ భూమికి ఎకరానికి రూ.15 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు పట్టా భూములను ఎకరానికి రూ.21.70 వేలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు.దీనినే ఆసరా చేసుకున్నారు. స్థానిక వైసిపి నేతలు , రెవెన్యూ అధికారులు కలిసి పక్కా వ్యూహం రచించారు. 11 మంది నకిలీ రైతులను సృష్టించి, సాగుదారులగా చూపి, మొత్తం రూ.45.35 కోట్లు దోచుకోడానికి పక్కా ప్రణాళిక రచించారు. ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశాలతో గూడూరు ఆర్‌డిఒ మురళీ కృష్ణ విచారణ చేపట్టారు.పూర్తి నివేదికకలెక్టర్‌కు సమర్పించారు.ఆన్‌లైన్‌ రికార్డులు పరిశీలించి తహశీల్దారు,కంప్యూటర్‌ఆపరేటర్‌ ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు.
కోస్టల్‌ క్యారిడార్‌ పేరుతో రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తన భూ సేకరణ పూర్తి చేస్తున్నారు.ఇప్పుడు అందరిపై అనుమానాలకు తావిస్తోంది.
అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే అవినీతికి అడ్డుపడుతుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. చిల్లకూరు మండలం,తమ్మినపట్నంలో సర్వే నెం.722-పి, 724లో ఓ ప్రభుత్వ ఉద్యోగిపేరుపై ఫోర్జరీ సంతకాలతో మరో 8ఎకరాలు పట్టాలు చేసినట్లు సమాచారం. దీనికి పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు సమాచారం. చిల్లకూరు మండలంలో జరుగుతోన్న భూదందాలోప్రభుత్వ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.కలెక్టర్‌ చర్యలు తీసుకొని సస్పెన్షన్ వేటు వేశారు.  భూములు అటు, ఇటు పంపిణీ జరుగుతున్న వేళ అసలైన రైతులు మాభూములు ఇలా అయిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేసులు నమోదుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
చిల్లకూరు మండలం లోని తమ్మినపట్నం లో జరిగిన భూ అక్రమాలు రుజువు కావడంతో జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు  తహశీల్దార్ గీతవాణి,ఆర్ ఐ సిరాజ్, కంప్యూటర్ ఆపరేటర్ నవిన్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని ఆదేశాలు జారీచేశారు. కానీ వారిపై అధికారులు కేసులు నమోదు చేయలేదు.కారణం రెవెన్యూ అసోసియేషన్ వారు తహశీల్దార్ గీతవాణి,ఆర్ ఐ సిరాజ్లను తప్పించి కంప్యూటర్ ఆపరేటర్ నవిన్ పై మొత్తం నెపం నెట్టలని ప్రయత్నాలు మొదలు పెట్టి అన్నీ రికార్డులు సిద్ధం చేసినట్లు విశ్వనీయ సమాచారం. ఈ వ్యవహారాలు మొత్తం కేంద్ర బిందువుగా చిల్లకూరు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువేత్తయి.కంప్యూటర్ ఆపరేటర్ నవిన్ కు ఈ విషయాలు తెలిసి తహశీల్దార్ రవీంద్రబాబు కు ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్న అతనికి సమాచారం ఇవ్వడంలేదు అని తెలుస్తుంది.ప్రస్తుత చిల్లకూరు తహశీల్దార్ రవీంద్ర బాబు రెవెన్యూ అసోసియేషన్ సెక్రటరీ గా వుండటం తహశీల్దార్ గీతవాణి ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తునట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాలు అన్నీ కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

Previous articleదిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌ ను విచారించనున్న సిర్పుర్‌ కమిషన్‌
Next articleనెల్లూరు ఎంపీ ఆదాలను కలిసిన ఆత్మకూరు జడ్పిటిసి ప్రసన్న లక్ష్మి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here