మచిలీపట్నం
దీపావళి బాణా సంచా విక్రయ స్టాల్స్ అనుమతులపై పోలీస్, తహసీల్దార్లు, అగ్నిమాపక అధికారులతో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బందర్ రెవెన్యూ డివిజన్ స్థాయి సమావేశం ఆర్డీఓ ఖాజావలీ నిర్వహించారు. స్టాల్స్ ఏర్పాటులో తీసుకోవల్సిన చర్యలను వివరించారు. నిబంధనల మేరకే స్టాల్స్ ఏర్పాటు చేయాలి స్టాల్స్ ఏర్పాటులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వారు నవంబర్ 1వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డిఓ సూచించారు. ఈ సమావేశంలో బందరు డిఎస్పి మాసుం బాషా అవనిగడ్డ డిఎస్పి మహబూబ్ బాషా, ఆయా మండల తహసీల్దార్లు, అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు