హైదరబాద్ నవంబర్ 15
నవంబర్ 14 బాలల దినోత్సవం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని “రెడీ టు సర్వ్” ఆధ్వర్యంలో శ్రీ సాయి గ్రామర్ హైస్కూల్ గౌతమ్ నగర్ దిల్సుఖ్నగర్ బ్రాంచ్ నందు పిల్లలకు మా స్కూలు శానిటైజర్లు స్వచ్ఛందంగా పంచడం జరిగింది. ఈ సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్ది శంకర్, మరియు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ బాబు మరియం మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రబలి ఎంతోమంది ప్రజానీకం మరణించడం, ఎన్నో రోజులు లాక్ డౌన్ పేరుతో స్వీయ నిర్భంధంలో ఉన్నాము. విద్యాసంస్థలు అన్నీ కూడా నిర్బంధించ బడి పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఆ దేవుడు కరుణించి కొద్దిగా కరోనా ప్రబలడం ఆగడ్డంతో మళ్లీ యధావిధిగా విద్యా సంస్థలు తెరుచుకోవడం పిల్లలు స్కూల్ కి రావడం జరుగుతూ ఉంది. పాశ్చాత్య దేశాలలో కరోనా 3 వేవ్ కేరళ నృత్యం చేస్తుంది చాలా మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ దుస్థితి మన దేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి రాకూడదని ప్రతి రోజూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసు స్కూల్లో కరోనా జాగ్రత్తలు తీసుకునే సౌలభ్యాలు లేవనే ఉద్దేశంతో ఈరోజు బాలల దినోత్సవం నవంబర్ 14 ను పురస్కరించుకొని శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్ లో 1000 మంది విద్యార్థులకు గాను శానిటైజర్ మాస్కులు పంచడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రిన్సిపల్ పద్మజా, టీచింగ్ సిబ్బంది ఎంతో సహకరించారు వారందరికీ ధన్యవాదాలు చేసినారు. ఈ కార్యక్రమంలో పెద్ది రేణుక, సందీప్,రవళి,శ్రీనివాస్ కొండల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.