Home నగరం అయిదు సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ రెబల్‌స్టార్ ప్ర‌భాస్

అయిదు సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ రెబల్‌స్టార్ ప్ర‌భాస్

118
0

బాహుబ‌లి సీరీస్ త‌రువాత ప్ర‌పంచం లో వున్న తెలుగు వారే కాకుండా సినిమా అభిమానులంతా ప్రేమించే హీరో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌త్యేఖంగా భార‌త‌దేశం లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో  అభిమానుల్ని సంపాదించుకున్న పాన్ ఇండియన్‌ స్టార్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ పెరిగిన తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. వ‌రుస‌గా మూడు చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన స్టార్ అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం గ‌ర్వం లేకుండా అందరితో చాలా వినమ్రంగా, వినయంగా డార్లింగ్ అంటూ ప్రేమ‌గా మాట్లాడుతూ ఉంటారు. సౌత్ నుండి నార్త్ వెళ్ళి స్టార్ గా నిల‌దొక్కుకున్న హీరోగా ప్ర‌భాస్ కి ప్ర‌త్యేఖ స్థానం వుంది. ఆయ‌న నార్త్ ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందట‌మేకాకుండా నార్త్ స్టార్స్, డైర‌క్ట‌ర్స్ ప్రేమ‌ని కూడా సొంతం చేసుకున్నారు. సాహో చిత్రం సౌత్ కి ధీటుగా నార్త్ లో కూడా క‌లెక్ష‌న్లు అందుకోవ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం.
అయిదు సినిమాలు అయిదు విభ‌న్న‌మైన జోన‌ర్లు అయిదు ప్రాత‌ల్లో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్
కెరీర్ పరంగా ఇప్పుడు టాప్ స్పీడ్ లో వున్న‌ ప్రభాస్ 2025 వ‌ర‌కు ఫుల్ బిజీగా ఉండ‌నున్నారు. ప్రస్తుతం 5 సినిమాలతో ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. 5 డిఫ‌రెంట్ జోన‌ర్స్ లో న‌టిస్తూ 5 విభన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.  మరీ ముఖ్యంగా 2022 మొత్తం ప్రభాస్ నామ సంవత్సరంగా మారబోతుంది.
ఎవ‌రూ ఆ విక్ర‌మాదిత్య‌…! ప్రేమ‌క‌థ‌తో సిద్ధ‌మైన రాధేశ్యామ్
2022 జ‌న‌వ‌రి 14న ల‌వ‌ర్ బాయ్ గా చాలా గ్యాప్ త‌రువాత గొప్ప ‌ప్రేమ‌క‌థ‌తో రాధే శ్యామ్ గా రానున్నారు, ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ వారు రాధ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇందులో చాలా స్టైలిష్ గా కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రాధేశ్యామ్ పోస్ట‌ర్ల‌కి, గ్లిమ్ప్స్ వీడియోకి దేశ‌వ్యాప్తంగా విశేషాద‌ర‌ణ ల‌భించింది. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాధేశ్యామ్ టీజ‌ర్ విడుద‌ల అవ్వ‌నుంది
ఫుల్ మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌లార్
ఛ‌త్ర‌ప‌తి త‌రువాత ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ స‌లార్, ఈ సినిమాను సైతం 2022లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కేజీఎఫ్ సిరీస్ ద‌ర్శ‌కుడ ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమా హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా సిద్ధం చేస్తున్నారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కి ఫుల్ కిక్ ఇచ్చే సినిమాగా స‌లార్ రెడీ అవుతుంది
తొలిసారిగా శ్రీరాముడి పాత్ర‌లో ప్ర‌భాస్
కెరీర్ లో తొలిసారిగా మైథిలాజిక‌ల్ జాన‌ర్ లో తెర‌కెక్కుత‌న్న సినిమాలో న‌టిస్తున్నారు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఆధిపురుష్ అనే టైటిల్ తో 3డిలో రామాయ‌ణాన్ని భార‌త‌దేశ సినీ ప్రేక్ష‌కుల‌కి అందించ‌డానికి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ పూనుకుంది. ఆ బాధ్య‌త‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఓం ప్ర‌కాశ్ రౌత్ కి అప్ప‌గించింది. ఓం ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధం అవుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ శ్రీరాముడిగా క‌నిపించబోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.‌
సైన్స్ ఫిక్ష‌న్ ప్ల‌స్ యాక్ష‌న్ ప్రాజెక్ట్ కే
మ‌హాన‌టి సినిమాతో నేష‌న‌ల్ ఐడెంటి సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కోసం ప్రాజెక్ట్ కే అనే, ఓ సైన్స్ ఫిక్ష‌న్ స్టోరీని సిద్ధం చేశారు. బిగ్ స్క్రిన్ పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఓ విజువ‌ల్ ట్రీట్ ఇచ్చే మూవీగా ప్రాజెక్ట్ కే రెడీ అవ్వ‌నుంది. అందాల‌తార దీపికా ప‌దుకొణే ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది, బిగ్ బి అమితాబ్ మ‌రో కీల‌కమైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.
వైవిధ్య‌మైన క‌థ‌తో స్పిరిట్
ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఓ డిఫ‌రెంట్ స్టోరీని ప్ర‌భాస్ కోసం రెడీ చేశారు. స్పిరిట్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి క‌న్ఫార్మ్ చేశారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 25వ సినిమాగా స్పిరిట్ ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది. 8 భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.
ఒక వైపు పర్సనల్ లైఫ్ మ‌రియు ప్రోఫెష‌న‌ల్ లైఫ్‌ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ కోట్లాది మంది అభిమానాన్ని వారి ప్రేమ‌ని సంపాదించుకున్నారు. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ పుట్టినరోజు అంటే తెలుగు సినిమా అభిమాన‌ల‌కు పండగ రోజు. ఇలాంటి పుట్టిన రోజులు ప్ర‌భాస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు.. వ‌రుస‌గా 5 పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న హీరోగా ఇండియ‌న్ సినిమా లో ప్ర‌త్యేఖ‌స్ధానం సొంతం చేసుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

Previous articleఎట్టకేలకు బోడుప్పల్ మునిసిపల్ సూరజ్ నగర్ లో ప్రారంభమైన డ్రైనేజీ పనులు
Next articleఇంటర్మీడియెట్ ఫిస్ట్ ఇయర్ పరీక్షల విషయంలో జోక్యం చేసుకోలేము స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here