ఖమ్మం
ప్రజల సౌకర్యార్థం ప్రతిరోజు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పోలీస్ కమీషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చె ఫిర్యాదుదారుల నుండి ప్రతిరోజు (పని దినాల్లో) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం ప్రకాష్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదేవిధంగా సాయంత్రం 6;00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అర్జీలను స్వీకరించి వారితో పోలీస్ కమిషనర్ గారు ముఖాముఖి మాట్లాడుతారని, వారి సమస్య పూర్వాపరాలను తెలుసుకుని, వాటి తీవ్రత ఆధారంగా సంబంధిత పోలీస్ అధికారులను వెంటనే విచారణ జరిపించి సత్వరంగా పరిష్కరించవలసిందిగా తగు ఆదేశాలను జారీ చేస్తారని తెలిపారు.
జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉన్న ప్రతిరోజు సందర్శకులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో సందర్శకులను మరియు పోలీస్ అధికారులను, సిబ్బందిని కలవనున్నట్టు చెప్పారు. పోలీస్ అధికారులు వచ్చే వరకు వేచి చూడకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా,సమయం వృధా కాకుండా కేటాయించిన ఈ నిర్ధిష్ట సమయాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు/ఫిర్యాదుదారులు సద్వినియోగం చేసుకొవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. అదేవిధంగా సందర్శకులు మరియు ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిఐలు, ఏసీపీ అధికారులు తమ కార్యాలయాల్లో యధావిధిగా విధులు నిర్వహిస్తూ.. మధ్యాహ్నం 3:00 గంటల నుండి 5:00 గంటల వరకు ప్రజలకు అందుబాటులో వుండాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజల అవగాహన కోసం అయా కార్యాలయలలో,పోలీస్ స్టేషన్లలో సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.