Home ఆంధ్రప్రదేశ్ అహంకారాన్ని తగ్గించుకోండి ప్రభుత్వం సోయతో పని చేయాలి ఇంత...

అహంకారాన్ని తగ్గించుకోండి ప్రభుత్వం సోయతో పని చేయాలి ఇంత బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని చూడలేదు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా ? వరద బాధితులకు తక్షణ పరిహారం ఇవ్వాలి – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్

216
0

కడప
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అహంకారాన్ని తగ్గించుకుని వరద బాధితులకు తక్షణ పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఇంతటి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని, ఇప్పటికైనా సోయతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని, ఎన్ని పైసలు ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయని ప్రశ్నించారు. అసెంబ్లీ లో కూర్చుని బూతులు మాట్లాడేకన్నా వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చి ఉంటే ప్రజలు సంతోషించే వారని అన్నారు.  పెద్ద దిక్కులు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు అధికారులు ఇంకా ఆ ప్రాంతాలకు వెళ్లలేదని అన్నారు. శుక్రవారం ఆయన కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ కర్నూలులో వరదల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 50మంది శాసన సభ్యులు అక్కడే ఉండి పరిస్థితిని చక్కదిద్దారని గుర్తు చేశారు. మళ్లీ తుఫాన్ హెచ్చరిక ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీలో కూర్చుని కుటుంబాల గణన చేస్తున్నారని, పన్నుల భారం మోపేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే రాజంపేట, నందలూరు ప్రాంతంలో జరిగిన ప్రాణ హాని, ఆస్థి నష్టం నివారించి ఉండవచ్చని అన్నారు. అనుమతిలేని భవనాలు కూలి ఆరుగురు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గాలిలో తిరిగి చూసి వెళ్ళిపోతే పోయిన ప్రాణంతో సరి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాంలో ఇలాంటి విపత్తులు సంభవించినపుడు పొలాల వద్దకు, డ్యామ్ ల వద్దకు అధికారులను పంపించి పర్యవేక్షించారని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా సేవలు అందిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని జగన్ రెడ్డి, బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించేలా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.

Previous articleడిసెంబ‌ర్ 6న భార‌త్‌కు రానున్న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌
Next articleజడ్పీ స్కూలు లో రాజ్యాంగ దినోత్సవం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here