Home ఆంధ్రప్రదేశ్ నియంత్రణలు ఎక్కువ…వెలవెలపోతున్న వ్యాపారాలు

నియంత్రణలు ఎక్కువ…వెలవెలపోతున్న వ్యాపారాలు

293
0

తిరుమల
తిరుమలలో తితిదే యాజమాన్యం నియంత్రణలు జాస్తిగా చేయడం వలన వ్యాపారాలు కుంటుబట్టాయి.  కోవిడ్  ప్రభావం అంటూ  అతిగా ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో  శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి డిమాండ్ ఎక్కువైంది. మరోవైపు,  భక్తుల విజ్ఞప్తిని పట్టించుకోవడం మానేశారు. గతనెల నుండి ఆన్లైన్ రూ మూడువందల  టికెట్లు పదిహేనువేలకు పరిమితం అయింది. ఇక చాలా తక్కువగా సాధారణ ఎనిమిదివేలమందికి సర్వదర్శనం అవకాశం ఇచ్చింది, ప్రముఖులు, శ్రీవాణి రుసుం వాటితో కలుపుకున్నా ముప్పైవేల భక్తులు వస్తున్నారు. పదిహేను శాతం మించడంలేదు. ఇకకొండకు పోయి స్వామికి తలనీలాలు, ముడుపులు, కానుకలు ఇద్దామన్నా అలిపిరి తనిఖీ ప్లాజాలో టికెట్లు ఉన్నవారికే ప్రవేశం అని ఆంక్షలు విధిసత్ఉన్ఆరు. వైరస్ నెపంతో క్షేత్రానికి రాకుండా శ్రీవారిని భక్తులను దూరం చేస్తున్నారు.  ఒక వైపు కరోనా నిబంధనలు, మరోవైపు టీటీడీ ఆంక్షలులో భక్తుల రద్ది తగ్గిపోయింది. దాంతో కొండనై వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారుల బతుకు తెరువు గగనమయింది.  టీస్టాళ్లు  నూట ఇరవై ఐదు, చిరువ్యాపారాలు ఐదువందల పైగా, టిఫిన్ సెంటర్లు,  వెయ్యికి పైగా కాంప్లెక్స్ దుకాణాలు ఉన్నాయి.  భక్తుల రాకపోకలు స్వల్పంగా ఉండండంతో  వారి కొనుగోలు చాలా తగ్గింది. మరోవైపు తప్పనిసరి భారంగా విధ్యుతు,అద్దెలు చెల్లింపులు మిగిలాయి.
వేలం హోటల్ దివాళానే
కొండమీద జనతా, డీలక్స్ హోటళ్లు పదకొండు పైగా ఉంది. ఇక అధికారులు సంస్థకు ఆర్జన ఆశించి వేలం హోటల్ కేటాయించారు. జనతా ఐదు రూ లక్షల పైగా డీలక్స్ ఇరవై ఐదు, ముప్పై రూ లక్షల పైగా ఉంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంటులకు సంచారం అంతంత మాత్రమే నమోదవుతుంది.  పనివారికి వేతనాలు, నెల బాడుగ, విద్యుత్, నీరు బిల్లులు సకాలంలో చెల్లించలేకుండా అప్పులు పాలవుతున్నారు.ఇదే బాటలో టిఫిన్ దుకాణాలు నష్టాలు చూస్తున్నాయి. దీంతో ఆయా వ్యాపారుల ప్రశ్నార్థకంగా మారింది

Previous articleకొండా” చిత్రం ప్రారంభం
Next articleఅభివృద్ధి కి నేను ఎప్పుడూ అడ్డుపడలేదు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here