Home ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై జిల్లా యస్.పి సమీక్ష.

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై జిల్లా యస్.పి సమీక్ష.

281
0

తిరుపతి
ఈనెల 14న తిరుపతిలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హాజరవుతున్న నేపధ్యంలో భద్రత ఏర్పాట్లపై సమాక్షా సమావేశాన్ని జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు జిల్లా ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై డి.యస్.పి స్థాయి అధికారులను సమన్వయ నోడల్ ఆఫీసర్ గా నియమించి భద్రత పరమైన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసారు.
ఈ సందర్బంగా నోడల్ ఆఫీసర్లకు మరియు బందోబస్తు పర్యవేక్షణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలపై సమీక్షించారు. ఈ నెల 14వ తేది జిల్లాకు అత్యంత ప్రముఖులు రానున్నందున వారికి భద్రతా పరమైన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి సమావేశ వేదిక అయిన తాజ్ హోటల్, తిరుమల వరకు ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాంబ్ డిస్పోజల్, యాంటీ సబటేజ్ చెక్ లను జాగ్రత్తగా చేయాలన్నారు. బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది కోవిడ్ నిబందనలను పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రముఖులందరూ తిరుమల శ్రీవారి దర్శనార్థం సూచనలు ఉన్న కారణంగా వారు ప్రయాణించు మార్గంలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.              వేదిక చుట్టుపక్కల ప్రాంతాల యందు సి.సి కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా సరిహద్దుల యందు ప్రత్యేక చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి అనుమానిత వ్యక్తులనే కాకుండా అసాంఘిక శక్తుల గురించి జిల్లాకు వచ్చు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీలు చేపట్టాలన్నారు. మెటల్ డిటెక్టర్ లతో హోటల్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ పోలీసు జాగిలాలతో కూడా ప్రముఖులు వెళ్లే దారిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.  వచ్చే ఐదు రోజులు జిల్లా ధికారులు, సిబ్బంది క్రమశిక్షనతో కష్టపడి ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రముఖులకు భద్రత కల్పించాలని స్థాయితో పని లేకుండా అందరు కష్టపడి ఈ సమావేశాన్ని విజయవంత చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అయన కోరారు.
ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ ఇ.సుప్రజా, యల్&ఓ  అరిఫుల్లా, తిరుమల డి.యస్.పి లు యస్.బిజిల్లా డి.యస్.పి లు, ఏ.ఆర్ డి.యస్.పి, కమ్యూనికేషన్ డి.యస్.పి, పాల్గొన్నారు.

Previous article34 వ డివిజన్ అభివృద్ధి సంక్షేమానికి షేక్. ఫామీదను గెలిపించాలి వైకాపా నేత షేక్. సంసుద్దీన్
Next articleపెట్రోలు డీజిల్ పై ధరలు తగ్గించాలని నిరసనలు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ సుంకం పూర్తిగా రద్దు చేయాలి టీడీపీ డిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here