Home ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

313
0

తిరుపతి
ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి  తిరుపతి పర్యటన నేపధ్యంలో పకట్బంది భద్రతా ఏర్పాట్లు చేసారు.  ఈ నేపధ్యంలో బందోబస్తు అధికారులతో జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు భద్రతపై సమీక్ష నిర్వహించారు.           ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ ఇ.సుప్రజ, శాంత్రి భద్రత  అరిఫుల్లా ,  తిరుమల మునిరామయ్య, , ఇంటలిజెన్స్ అధికారులు, డి.యస్.పి లు, సి.ఐ లు, యస్.ఐ లు పాల్గొన్నారు.          ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  11వ తేది తిరుపతి తిరుమల లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో నిన్నటి దినం తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుండి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్  ను తిరుమల వరకు సి.యం గారు పర్యటించు ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది.            రేణిగుంట విమానాశ్రయం నందు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అలాగే పర్యటన రహదారుల యందు అవసరమున్న ప్రతి చోట బ్యారికేట్స్, స్టాప్ బోర్డులను ఏర్పాటు చేసున్నాము. భద్రత దృష్ట్యా కార్యక్రమం ప్రాంతాల చుట్టూ రూఫ్ టాప్స్ పై దృష్టి సారించి భద్రతను పెంచుతున్నామన్నారు.        అత్యవసర వాహనాలకు మరియు హాస్పిటల్ కు వచ్చు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే తిరుమల యందు యాత్రికులకు, భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి  పర్యటించు సమయం లో న్ని ప్రధాన ప్రాంతాల లో కొంత సమయం వరకు ట్రాఫిక్ ను మళ్ళించడం జరుగుతుంది. ప్రజలు దీనికి సహకరించాలని తెలిపారు.  ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బందోబస్తును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విధులు నిర్వర్తించాలి. ప్రతి బందోబస్తును కొత్తగా చేస్తున్నామనే ఉద్దేశంతో జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి. విధుల యందు అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రముఖులకు భద్రత కల్పించడం మన విధి, మన కర్తవ్యంగా భావించి పని చేయాలన్నారు.  జిల్లా సరిహద్దు, ప్రధాన రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి భద్రతను పెంచుతున్నాము. అలాగే తిరుమల అప్ ఘాట్, డౌన్ ఘాట్ రోడ్డుల యందు బి.డి టీం, డాగ్ స్క్వాడ్, ఆర్.ఓ.పి  బృందాలచే విస్తృతంగా అణువణువు తనికీలు చేపట్టి కట్టు దిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాము.       అధికారులు నిరంతరం కార్యక్రమ ప్రదేశాలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పడు సూచనలు, సలహాలిస్తూ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకోకుండా చూడాలని అధికారులకు సూచనలు చేసారు.  మనం చేసే వ్రుత్తి మనకు దైవంగా భావించి విధుల యందు అప్రమత్తంగా ఉండి పర్యటనను విజయవంత చేయాలని ఈ సందర్భంగా జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు, అధికారులను ఉద్దేశించి భద్రతపై పలు సూచనలు, సలహాలు చేసారు.
బందోబస్తు విధుల కొరకు అధికారులు, సిబ్బంది:-
అడిషనల్ యస్.పి లు 05, డి.యస్.పి లు 16, సి.ఐ లు 37, యస్.ఐ లు 91, ఏ.యస్.ఐ/హెచ్.సి లు 204, పి.సి లు 467, ఉమెన్ పోలీసులు 56, హోంగార్డ్స్ 118, స్పెషల్ పార్టీ సిబ్బంది 120 మొత్తం 1,114 పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసారు.

Previous articleమంత్రి పదవిని ఆశించడం లేదు శిల్ప చక్రపాణి రెడ్డి
Next articleజాజి ప‌త్రి, పిస్తా, క‌ర్జూరం, ఎండు ద్రాక్ష‌ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌వారికి స్న‌ప‌నం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ప‌ద్మ‌ మండ‌పం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here