గోదావరిఖని అక్టోబర్ 7
కోవిడ్ మూడవ విడత వచ్చినా ఆక్సిజన్ సమస్య రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నూతన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆక్సిజన్ అందక పోవడంతో కొంతమంది ప్రాణాలను కోల్పోవడం జరిగిందని గుర్తు తెచ్చుకున్నారు. అందుకే కోవిడ్ సెకండ్ వెవ్ పూర్తి కాకముందే ప్రాణవయువు కొరతతో ఏ ఒక్క రోగి ప్రాణాలను కోల్పోకుండా ఉండాలనే ఉద్యేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కేర్ (ప్రధాన మంత్రి నిధి) సహకారంతో రాష్ట్రం లోని ప్రతి జిల్లాకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను కేటాయించారన్నారు. ఈ రోజు దేశ ప్రధాన మంత్రి 34 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ లను ప్రారంభించి దేశానికి అంకితం చేశారని తెలిపారు. అందులో భాగంగానే మన జిల్లాలోని గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి 500 లీటర్ ఫర్ మీనిట్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రారంభించామని తెలిపారు. దీని ద్వారా జ సరిపడా ఆక్సిజన్ ఉత్పతి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.