పత్తికొండ
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేవనబండ గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ (పేరెంట్స్ కమిటీ) ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొత్తపల్లి సత్యనారాయణ, సీనియర్ ఉపాద్యాయుడు నాగేటి ప్రసాద్, టీచర్లు సులోచనమ్మ, లలిత విడుదల చేశారు. తల్లిదండ్రుల కమిటీ సభ్యులు గా ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురు సభ్యుల ప్రకారం మొత్తం 5 తరగతులకు 15 మంది సభ్యులను ఎన్నుకోవాలని కొత్తపల్లి సత్యనారాయణ అన్నారు.22/9/2021 తేదీన ఈ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఈ 15 మంది సభ్యులు చైర్మన్, వైస్ ఛైర్మన్ ను ఎన్నుకుంటారని తెలిపారు. వీరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఒక టీచర్, ఒక వార్డు సభ్యుడు,అంగన్ వాడి కార్యకర్త, ఏఎన్ఎం, మహిళా సమైఖ్య అధ్యక్షురాలు మరియుఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమిస్తారని తెలియజేశారు.
Home ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికకు షెడ్యూలు విడుదల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న...