మేడ్చల్
జవహార్ నగర్ లో చిల్లర గాళ్ళ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడున్నారు. తాజాగా ప్రేమించానని ఒక యువతిని తగులబెట్టాడో యువకుడు. స్థానికంగా వుంటున్న తోడెటి నవీన్ (21), ప్రేమ పేరుతో ఓ యువతి తల్లిదండ్రులను హెచ్చరించి మరీ ఇంటిని తగలబెట్టిన ఘటన మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పి.యస్ పరిధిలోని బి.జే.ఆర్ నగర్, మల్లికార్జున నగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెలితే బి.జే.ఆర్ నగర్, మల్లికార్జున నగర్ లో నివాసం వుండే నవీన్ అనే యువకుడు స్థానికంగా వుండే యువతితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని గమనించిన యువతి తల్లిదండ్రులు నవీన్ ను మందలించారు. దీనితో కక్ష పెంచుకున్న నవీన్ మీ అంతుచూస్తానని ముందుగానే హెచ్చరించి యువతి ఇంటిని ఎవరు లేని సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు.దీనితో బాధితుల ఇంటితో పాటు ఇంట్లో వున్న వస్తువులన్ని మంటల్లో కాలి దగ్దమయ్యాయి. ఈ ఘటనపై బాధితులు జవహార్ నగర్ పోలీసులను ఆశ్రయించగా ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసారు. వెంటనే నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.