నంద్యాల అక్టోబర్ 4
స్పందన కార్యక్రమానికి 29 వినతులు అందినాయి అని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం లో స్పందన కార్యక్రమము నిర్వహించారు ఈకార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్.సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి హరినాథరావు . లతో కలసి కోవిడ్ నిబంధనలు పాటించుచు వినతిదారుల నుండి వినతులు స్వీకరించారు.
అనంతరం సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ సోమవారం నాడు జరిగిన స్పందన కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించుతూ వినతిదారుల నుండి వినతులు స్వీకరించినామని అన్నారు. వినతి దారులకు ముఖ్యంగా తెలియజేయడమేమనగా మీ పరిధిలోని సచివాలయం నందు మరియు మండల తహశీల్దార్ వారి కార్యాలయం నందు కూడా వినతులు స్వీకరించబడతాయి అని అన్నారు. అక్కడ పరిష్కారం దొరకనప్పుడు మాత్రమే డివిజన్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం నకు రావాలన్నారు. ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమములో
నంద్యాల మండల కేంద్రం రంగరాజు వీధి నివాసి బేతం శెట్టి .భోగేశ్వర్లు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ నందు పోస్ట్ గ్రాడ్యూవెట్ చేస్తున్నాం మాకు జగన్ అన్న దీవెన కానుక అందలేదు దయతో ఇప్పించ గలరు అని అడిగారని తెలిపారు. .
గోస్పాడు మండలం జూలపల్లి గ్రామం నివాసి తలారి
మెరిగె చిన్న సుబ్బరాయుడు నాకు వస్తున్నటువంటి పింఛను ఆపివేశారు ఎందుకు నిలుపుదల చేశారు అన్ని గ్రామ వాలంటరీని అడుగగా నీ పేరు మీద మూడు ఎకరాల రెండు సెంట్లు భూమి కలదని అంటున్నాడని అన్నారు. వాస్తవానికి నా పేరు మీద ఒక ఎకరా 25 సెంట్లు మాత్రమే కలదు దయతో నాకు పింఛన్ ఇప్పించ గలరు. బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామనివాసి బెల్లం మహేష్ వికలాంగుడిని నాకు దివ్యాంగుల పెన్షన్ ఇప్పించగలరని కోరుచున్నాను వాలంటీర్ల దగ్గరికి వెళ్లగా వాలంటరీ మీ ఇంటి సర్వే ఐడి నమోదు కాలేదు నీకు పింఛన్ రాదు అంటున్నాడు దయతో నాకు పింఛన్ మంజూరు చేయగలరు.
గడివేముల మండల కేంద్రంలోని ఆలకుంట పెద్ద సుబ్బన్న నాకు గడివేముల మండల సమీపంలోని కొర్ర పోలూరు గ్రామ పొలిమేరలో 365/F సర్వే నెంబర్ లో మూడు ఎకరాల 31 సెంటు భూమి కలదు దీనికి సంబంధించిన రిజిస్టర్ పత్రాలు కూడా కలవు కానీ నా భూమిని ఆన్లైన్లో నమోదు చేయించి పాస్ పుస్తకాలు ఇప్పించగలరని కోరుతున్నారు.
కొలిమిగుండ్ల మండల కేంద్రం నివాసి ఏం కృష్ణుడు మేము మాదిగ కులమునకు చెందిన నిరుపేదలము మాకు సాగు చేసుకొనుటకు మూడు ఎకరాల భూమిని ఇప్పించగలరని కోరుచున్నారు.
ఈరోజు జరిగిన కార్యక్రమానికి ఎక్కువ శాతం భూ తగాదాల గురించి. భూములను ఆన్లైన్లో నమోదు చేయించాలని. భూములను కొలతలు వేయించాలని. భూముల ఆక్రమించుకున్నారని అడంగల్ నందు భూముల వివరాలు నమోదు చేయాలని. పాణ్యం నుండి నెరవాడ వెళ్లే రహదారిలో కొంతమంది రైతులు రహదారిలో వెళ్లకుండా అడ్డుకుంటున్నారు .కుటుంబ తగాదాలను గురించి తదితర వినతులు అందినాయి అన్నారు. ఈరోజు కార్యక్రమానికి.29 వినతులు అందాయని సబ్ కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో . డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయము సిబ్బంది. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శిశు సంక్షేమ శాఖ సి డి పి ఓ . హౌసింగ్ ఆధికారి ఆర్ రామసుబ్బన్న . సూపర్వైజర్ శ్వేతమ్మ . ఆర్డబ్ల్యూఎస్. బి నబిరసూల్ ఎస్ ఆర్ బి సి JE .జ్యోతి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Home తెలంగాణ స్పందన కార్యక్రమానికి అందిన వినతులను సత్వరమే పరిష్కరిస్తాము నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్...