మనీలా అక్టోబర్ 2
వచ్చే ఏడాది జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి ప్రకటించారు. అంతేకాదు రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే దేశాధ్యక్ష పోటీ బరిలో తన కూతురుకు లైన్ క్లియర్ చేసేందుకు డ్యుటెర్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు అర్హత లేదని పిలిప్పీన్స్ ప్రజలు భావిస్తున్నారని, అందుకే తాను ఉపాధ్యక్ష పోటీకి దిగడం లేదన్నారు. కానీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 2016 దేశాధ్యక్ష ఎన్నికల సమయంలో పాపులర్ లీడర్‌గా ఉన్న డ్యుడెర్టి తన ఎన్నిక తర్వాత డ్రగ్స్ వ్యాపారులపై కొరఢా రుళిపించారు.