Home ఆంధ్రప్రదేశ్ శ్రీశైల దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ కమిషనర్

శ్రీశైల దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ కమిషనర్

109
0

శ్రీశైలం
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన
దేవదాయశాఖ కమీషనర్
రాష్ట్రదేవదాయకమీషనర్ డా. ఎం.హరిజవహర్లాల్ ఈ రోజు దేవస్థానం. పరిపాలనా భవనములో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈసమావేశములో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు. సంబంధిత సిబ్బంది.
పాల్గొన్నారు.
ముందుగా సమావేశములో కార్యనిర్వహణాధికారివారు దేవస్థానములో చేపట్టబడిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల ప్రణాళిక, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు మొదలైన అంశాల గురించి కమీషనర్ వారికి వివరించారు.
ప్రసాద్ పథకం క్రింద చేపట్టబడిన వివిధ పనులు, గణేశ సదనం నిర్మాణం, నక్షత్రవనం అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు మొదలైన అంశాలను గురించి వివరించారు. తరువాత సమీప భవిష్యత్తులో ప్రారంభించేందుకు తలపెట్టిన ఆలయమాడవీధుల అభివృద్ధి పనులు, క్యూకాంప్లెక్స్ నిర్మాణం, డార్మీటరీల నిర్మాణం, మ్యూజియం నిర్మాణం మొదలైన అంశాలను వివరించారు.
తరువాత దేవదాయశాఖ కమిషనర్ వారు దసరా మహోత్సవాలలో ఏర్పాట్లను గురించి సమీక్షించారు. ఉత్సవాలలో స్వామి అమ్మవార్లకు జరిపే పూజాదికాలు, భక్తులకు ఏర్పాట్లు మొదలైన వాటి గురించి చర్చించారు.
అనంతరం కమీషనర్ వారు మాట్లాడుతూ శ్రీస్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన కైంకర్యాలు, భక్తుల సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధి తదితర అంశాలపై పలు ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యంగా శ్రీస్వామి అమ్మవార్లకు, ఉపాలయాలలో దేవతామూర్తులకు, ఆయా పూజాదికాలను, సమయానుసారంగా సమర్పించాల్సిన నివేదనలను ఆగమశాస్త్రానుసారంగా మరియు పరిపూర్ణంగా జరిపించాలని ఆదేశించారు.
ఇంకా వారు మాట్లాడుతూ భక్తులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. క్షేత్రానికి విచ్చేసే ప్రతి భక్తుడు సంపూర్ణంగా తనయాత్ర ఫలవంతమైందనే తృప్తి కల్పించాల్సిన బాధ్యత దేవస్థానంపై ఉందన్నారు. భక్తుల మనోభావాలను, వారి విశ్వాసాలను గౌరవిస్తుండాలన్నారు. భక్తులు ఆనందంగా ఉన్నప్పుడే భగవంతునికి ఆనందం కలుగుతుందని, ఈ విషయాన్ని ఆలయ ఉద్యోగులందరు కూడా గుర్తుంచుకోవాలన్నారు.
తరువాత దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదానం, గో సంరక్షణ, పరిపాలన, ఆడిట్, అకౌంట్స్, సాయ ఇంజనీరింగ్, వైద్యశాల నిర్వహణ, పారిశుద్ధ్యం మొదలైన అంశాలను సమీక్షించారు.
ఇంకా వారు దేవస్థానంలో ప్రతి ఉద్యోగి కూడా నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు.
ప్రతి ఉద్యోగి కూడా తన విధుల పట్ల భక్తి, గౌరవాలను కలిగివుండాలన్నారు.
ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ జవాబుదారితనాన్ని పెంపొందించు
కోవాలన్నారు. ఈ విషయమై ప్రతి ఉద్యోగి కూడా స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. పాలనా
సంబంధి అంశాలలో పూర్తి పారదర్శకత ఉండాలన్నారు.

Previous articleబుడగ జంగాల కాలనీ లో మౌలిక వసతులు కల్పించాలి సీపీఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ డిమాండ్
Next articleప్రీపోల్ సర్వేలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here