నిర్మల్,
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మిడియట్ సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జాలిల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జాఖినేషన్ అబ్దుల్ ఖలీల్ లతో కలసి గురువారం అన్ని జిల్లా ల కలెక్టర్లు, అదనపు కలెక్టర్ లు, ఇంటర్ విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25వ తేది నుండి వచ్చే నెల 3వ తేది వరకు నిర్వహించే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సారి 4 లక్షల 58వేల మంది విద్యార్డులు పరీక్ష కు హాజరవుతారని అన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 14వందల నుండి 1750 కి పెంచామని వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రాలలో ఐసోలేషన్ సెంటర్ ఉండాలని ఆదేశించారు. విద్యార్డులు ఎలాంటి ఆందోళన కు గురికాకుండా పరీక్షలు వ్రాయాలని అన్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు రావాలని, పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం తో పాటు మంచి నీరు తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యార్డులు మాస్కలు ధరించాలని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఒక రోజు ముందే జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని , పరీక్ష కేంద్రాలలో అన్ని పూర్తి స్థాయిలో సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ డా,, పి. రాంబాబు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 25 నుండి నిర్వహించే ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా లో 33 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని సిసి కెమెరాలు అన్ని కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 7,924 మంది విద్యార్డులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ రామ్ రెడ్డి, ఇంటర్మిదియేట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరుశరామ్, పరీక్షల కమిటీ మెంబర్లు డా,, వెంకటేశ్వర్లు, జాదవ్ రవికిరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.