పెద్దపల్లి ప్రతినిధి అక్టోబర్ 29
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఇచ్చినటువంటి పోలీస్ వాహనాలు అయిన బొలెరో, పెట్రోల్ కార్, ద్విచక్ర వాహనాలు మెయింటనెన్స్ తనిఖీల్లో భాగంగా శుక్రవారం రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోని పోలీసు వాహనాలను ఆర్ఐ మధుకర్ (
ఎంటీవో పోలీసు వాహనాలు అధికారి) తనిఖీ చేశారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో వాహనాలు ఉపయోగిస్తున్న డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. అలాగే ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తున్న అధికారులు, సిబ్బంది చెప్పడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారి కొండపాక ప్రవీణ్ కుమార్,ఎస్ఐ లు నాగరాజు, సూర్యనారాయణ, కమలాకర్, ఏవోవి వెంకటేశ్వర్లు హెచ్ సీ . బాయి శ్రీనివాస్ . సిబ్బంది డ్రైవర్లు ఎంటీవో సెక్షన్ కు సంబంధించిన మెకానిక్.హెచ్ సీ లచ్చన్న,పీసీ ప్రవీణ్ లు పాల్గొన్నారు.