మేడ్చల్ అక్టోబర్ 25 (
కీసర మండలం యాద్గార్‌పల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డుప్రమాదం లో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు..వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.మృతులను సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఏసీపీ కేవీఎం ప్రసాద్ సతీమణి శంకరమ్మ, సోదరుడి కుమారుడు భాస్కర్ దంపతులు మృతి చెందారు. ఏసీపీ సోదరుడు బాలకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. బాలకృష్ణను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.