విజయవాడ
గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి పై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ లో ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్ బస్ వెనుకనుంచి కార్ ని ఢీ కొట్టింది. కారులో వున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు పెను ప్రమాదం తృటిలో తప్పినాకారు మాత్రం దెబ్బతిన్నది. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో వారధి పై ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సరైన పత్రాలు లేనట్లు సమాచారం.