Home జాతీయ వార్తలు రైల్లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌పై దోపిడీ దొంగ‌లు లైంగిక‌దాడి

రైల్లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌పై దోపిడీ దొంగ‌లు లైంగిక‌దాడి

241
0

ముంబై అక్టోబర్ 9
రైల్లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై దోపిడీ దొంగ‌లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. స్లీప‌ర్ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై ఎనిమిది మంది దోపిడీ దొంగ‌లు క‌త్తుల‌తో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల నుంచి న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను అప‌హ‌రించారు.  ఈ దారుణ ఘ‌ట‌న ల‌క్నో – ముంబై పుష్ప‌క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది. దొంగ‌ల దాడిలో ఐదారు మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.దీంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గురై గ‌ట్టిగా అర‌వ‌డంతో రైలును ముంబైలోని కాస‌రా స్టేష‌న్ వ‌ద్ద ఆపేశారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆ కోచ్ వ‌ద్ద‌కు చేరుకుని ఇద్ద‌రు దొంగ‌ల‌ను అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో న‌లుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ‌ల నుంచి రూ. 34 వేల న‌గ‌దు, ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Previous articleతైవాన్‌ను చైనా దేశంలో క‌లుపుకుంటాం: చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్
Next articleదేశంలో కొత్తగా 19,740 కరోనా కేసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here