హైదరాబాద్, నవంబర్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) పేరిట రూ.100కే ఒకరోజు పాస్ జారీ చేయనున్నట్టు ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఒక రోజంతా జంటనగరాల పరిధిలో ఏ ప్రాంతానికైనా సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఎన్నిసాైర్లెనా ప్రయాణించవచ్చని తెలిపారు. పెరిగిన పెట్రోలు ధరలతో సతమతమవుతున్న ప్రజలు అత్యంత చౌకలో, సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.అంటీ కాకుండా ఆర్టీసీ బస్సులోకానీ, బస్‌స్టేషన్ ప్రాంగణంలోకానీ గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటివి వాడకూడదని ఎండీ సజ్జనార్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీచేశారు. కొందరు డ్రైవర్లు, ప్రయాణికులు పాన్, గుట్కా, పాన్‌మసాలా వంటివి నమిలి బస్సులో, బయట ఉమ్మడం సరైంది కాదని అన్నారు. ఇలాంటి పద్దతికి స్వస్తి పలుకాలని సూచించారు.,